హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): తన వల్లనే సత్యనాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవో అయ్యారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. టీడీపీ హయాంలోనే తెలుగు రాష్ర్టాల్లో ఐటీ అభివృద్ధి చెందిందని, అందులో భాగంగా మైక్రోసాఫ్ట్‌ను ముందుగా తీసుకొచ్చామని తెలిపారు. అందులో సత్యనాదెళ్ల పనిచేయడం వల్లే సీఈవో అయ్యే అవకాశం వచ్చిందని అన్నారు. సత్యనాదెళ్ల 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరగా, చంద్రబాబు 1995లో సీఎం అయ్యారు.. ఇదెలా సాధ్యమైందంటూ పలువురు నెటిజన్లు వాపోతున్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో పర్యటించిన సీఎం చంద్రబాబు పెన్షన్ లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా.. త్వరలోనే కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం ప్రారంభిస్తామని చెప్పారు.