ధనుష్ పోలీస్ స్టోరీ?
కెరీర్ ఆరంభం నుంచి విభిన్న కథా చిత్రాలు, పాత్రల ద్వారా తనదైన పంథాను సృష్టించుకున్నారు తమిళ అగ్ర హీరో ధనుష్. అయితే కెరీర్లో ఇప్పటివరకు ఆయన పోలీస్ పాత్రను పోషించలేదు. అభిమానులు కూడా ఆయన్ని పోలీస్ క్యారెక్టర్లో చూడాలని కోరుకుంటున్నారు.
కెరీర్ ఆరంభం నుంచి విభిన్న కథా చిత్రాలు, పాత్రల ద్వారా తనదైన పంథాను సృష్టించుకున్నారు తమిళ అగ్ర హీరో ధనుష్. అయితే కెరీర్లో ఇప్పటివరకు ఆయన పోలీస్ పాత్రను పోషించలేదు. అభిమానులు కూడా ఆయన్ని పోలీస్ క్యారెక్టర్లో చూడాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారి అభిలాష ఫలించబోతున్నట్లు తెలిసింది. ధనుష్‌తో ‘సర్’ వంటి బ్లాక్‌బస్టర్ తీసిన దర్శకుడు వెంకీ అట్లూరి ఓ పవర్ఫుల్ పోలీస్స్టోరీని సిద్ధం చేస్తున్నారు. ఇందులో ధనుష్ హీరోగా నటించనున్నారు.
ఈ ప్రాజెక్ట్ కోసం తాను ప్రత్యేకంగా రీసెర్చ్ చేస్తున్నానని, యథార్థ సంఘటనల స్ఫూర్తితో కథ రాస్తున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు దర్శకుడు వెంకీ అట్లూరి. ప్రస్తుతం ధనుష్ తమిళంలో ‘ఓం’ చిత్రాన్ని చేస్తున్నారు. ‘అమరన్’ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకురానుంది. దీని తర్వాత ధనుష్-వెంకీ అట్లూరి సినిమా పట్టాలెక్కుతుందని సమాచారం. ఇదిలావుండగా సూర్య కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఆగస్ట్ 14న విడుదలకానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

