హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): పద్మ అవార్డుల ఎంపికపై తెలంగాణలో మొదలైన వివాదం ఇప్పుడు ఆంధ్రాకు పాకింది. గద్దర్‌కు పద్మ అవార్డు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేయడంపై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. రాజ్యాంగాన్ని విశ్వసించని వ్యక్తికి పద్మ పురసారం ఎలా ఇస్తారని నిలదీశారు. గద్దర్‌ను ఎల్టీటీఈ ప్రభాకరన్, నయీంతో పోల్చారు. గద్దర్ కుమార్తె కాంగ్రెస్‌లో ఉ న్నందున పద్మ పురసారం ఇవ్వాలా అని సీఎం రేవంత్‌రెడ్డిని నిలదీశారు. రాజీవ్‌ని చంపిన వారికీ పద్మ పురసారం ఇవ్వమంటారా అని ప్రశ్నించారు.