రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ) : రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. సిరిసిల్ల పట్టణంలోని బీవైనగర్కు చెందిన మరమగ్గాల కార్మికుడు బూర బలరాం (62) కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బతుకమ్మ చీరలతో ఉపాధి పొందాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉపాధి లేక ఆగమయ్యాడు. బతుకమ్మ చీరలు బంద్ కావడం, మహిళా సంఘాలకు ఇచ్చే చీరలు పూర్తిస్థాయిలో పని కల్పించకపోవడం తో పనిలేక ఖాళీగా ఉం టున్నాడు. ఈ క్రమం లో రూ.5 లక్షల వరకు అప్పులు అయ్యాయి. బాకీలు తీర్చాలంటూ ఒత్తిళ్లు పెరిగాయి. ఓవైపు పనిలేక.. మరోవైపు కుటుంబాన్ని పోషించలేక మనస్తాపంతో సో మవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నా డు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.