సింహం దాడిలో మృతుడి మరో నిర్వాకం
తిరుపతి ఎస్వీ జూపార్కులో రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద్ గుజ్జర్ మృతి ఘనటకు ముందు అతని మరో నిర్వాకం బట్టబయలైంది. జూపార్కుకు రాకమునుపు ప్రహ్లాద్ గుజ్జర్ తిరుపతిలోని హథీరాంజీ మఠానికి చెందిన వేణుగోపాలస్వామి ఆలయానికి వెళ్లాడు.
హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): తిరుపతి ఎస్వీ జూపార్కులో రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద్ గుజ్జర్ మృతి ఘనటకు ముందు అతని మరో నిర్వాకం బట్టబయలైంది. జూపార్కుకు రాకమునుపు ప్రహ్లాద్ గుజ్జర్ తిరుపతిలోని హథీరాంజీ మఠానికి చెందిన వేణుగోపాలస్వామి ఆలయానికి వెళ్లాడు. అకడి సిబ్బందితో గొడవపడి వారిపై దాడి చేశాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకు వచ్చింది. ఆలయానికి వెళ్లిన గుజ్జర్ స్వామిదర్శనం కోసం నేరుగా క్యూలైన్లో వెళ్లాడు. దర్శనానికి టోకెన్ తీసుకోవాలని సిబ్బంది చెప్పడంతో వారితో గొడవపడ్డాడు. టోకెన్లు జారీచేసే యంత్రాలను మఠం సిబ్బందిపై విసిరేశాడు. చిన్నపాటి ఆయుధంతో తోటి భక్తులను, సిబ్బందిని బెదిరించాడు. దీంతో కొంతమంది ధైర్యం చేసి అతన్ని చుట్టుముట్టి బంధించారు. ఆపై పోలీసులకు సమాచారం అందించారు. ఆ సమయంలో అతను గంజాయి సేవించినట్టు అకడివారు గుర్తించారని సమాచారం. జూపార్కుకు వెళ్లిన ప్రహ్లాద్ ప్రమాద హెచ్చరికలను లెక చేయకుండా తాళం వేసి ఉన్న మొదటి గేటు ఎకి లోపలికి ప్రవేశించాడు. ఆ తర్వాత వాటర్ ట్యాంక్ మీదుగా సింహాల ఎన్‌క్లోజర్‌లోకి దూకాడు. అకడే ఉన్న సింహం ప్రహ్లాద్ మెడ భాగంలో కొరికి అతన్ని చంపేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

