హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా మరో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటైంది. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథి రెడ్డి సొంత గ్రామమైన ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరులో తన మాతృమూర్తి పేరుతో జూనియర్ కాలేజీని నిర్మించారు. బుధవారం ‘బండి సోమ కాంతమ్మ జూనియర్ కళాశాల’కు అనుమతి ఇస్తూ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విద్యాసంవత్సరం నుంచే తరగతులు నిర్వహించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.