కరెంట్ కాటుకు మరో రైతు మృతి
విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండల పరిధిలోని నాగులపహాడ్‌లో గురువారం జరిగింది.
పెన్‌పహాడ్, మార్చి 14 : విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండల పరిధిలోని నాగులపహాడ్‌లో గురువారం జరిగింది. నారాయణగూడేనికి చెందిన నారాయణ లింగారెడ్డి (55) నాగులపహాడ్ రెవెన్యూ శివారులోని తన వ్యవసాయ బావి మోటర్‌కు అంతరాయం ఏర్పడటంతో దానికి సంబంధించిన విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ను ఆఫ్-ఆన్ చేయబోయాడు.
ట్రాన్స్ఫార్మర్కు సంబంధించిన హెచ్‌టీ బ్లేడ్స్ వద్ద తీగలు మెలితిరిగి ఉండటంతో ఆన్ ఆఫ్ రాడ్‌కు వేలాడుతున్న తీగలు తగలడంతో లింగారెడ్డి విద్యుత్తు షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పొలం దగ్గరికి వెళ్లిన లింగారెడ్డి రాత్రి అవుతున్నా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా ట్రాన్స్ఫార్మర్ వద్ద విగతజీవిగా పడి ఉన్నాడు. విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల రైతులు ఆరోపించారు. లింగారెడ్డికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

