హైదరాబాద్ : సింగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని ఇంద్రేశం బీసీ గురుకుల బాలికల పాఠశాలలో మరో 19 విద్యార్థినులు కరోనా బారినపడ్డారు. గురువారం 29 మంది వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షలు చేసిన విషయం తెలిసిందే. ఇవాళ 584 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 19 మందికి పాజిటివ్ అని తేలింది. ఇప్పటివరకు గురుకులంలో మొత్తం 46 మంది వైరస్ బారనిపడ్డారు. వైరస్ బారినపడ్డ వారిని ఐసోలేషన్‌లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు భయంతో పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు.