హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): సీపీఎస్‌ను రద్దు చేస్తామనడం హర్షణీయమని కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పుప్పాల కృష్ణకుమార్, హన్మండ్లభాస్కర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీపీఎస్‌ను రద్దు చేస్తే 1.7 లక్షల ఉద్యోగ కుటుంబాలకు మేలు చేకూరుతుందని తెలిపారు. గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్నట్టుగా ఈ హామీని కాంగ్రెస్ ప్రభుత్వం త్వరగా నెరవేర్చాలని పేర్కొన్నారు.