హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): అన్నారం పంప్ హౌజ్‌లోని రెండో మోటర్ వెట్న్ విజయవంతమైనట్టు అధికారులు మంగళవారం తెలిపారు. ఇటీవల కురిసిన అసాధారణ వర్షాలతో పంప్ హౌజ్ నీటమునిగిన విషయం తెలిసిందే. వరద నీటిని తొలగించిన వెంటనే అధికారులు పంప్ హౌజ్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఇటీవలే మొదటి పంప్ వెట్న్ విజయవంతంగా పూర్తి చేశారు. మంగళవారం రెండో పంపు వెట్న్ చేపట్టారు.
40మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఈ పంపు విజయవంతంగా నీటిని ఎత్తి పోసింది. దీనిపై ఇంజినీరింగ్ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. మరో వారంలో మూడో పంపును రన్ చేయనున్నట్టు ఈఎన్సీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ నెలాఖరు నాటికి పంపులన్నింటినీ వెట్ రన్‌ను పూర్తి చేయనున్నట్టు వివరించారు. మరోవైపు కన్నెపల్లి పంప్ హౌజ్ పునరుద్ధరణ పనులు కూడా శరవేగంగా సాగుతున్నట్టు పేర్కొన్నారు.