హైదరాబాద్,సిటీబ్యూరో, సెప్టెంబర్ 1(నమస్తే తెలంగాణ): దేవాదాయశాఖలో చోటుచేసుకుంటున్న పరిణామాలు పలు చర్చకు దారితీస్తున్నాయి. ప్రధానంగా ఈవోల బదిలీ ల విషయంలో ఇటీవల ఉత్తర్వులు ఇవ్వడం, ఆ వెంటనే రద్దు చేయడం పై ఆ శాఖలోనే అంతర్గతంగా చర్చ జరుగుతున్నది. గతనెల 30న బాస ర జ్ఞానసరస్వతి అమ్మవారి ఆల యం స్పెషల్ ఆఫీసర్‌గా భైంసా సబ్‌కలెక్టర్‌ను నియమిస్తూ నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఉత్తర్వులు జారీ చేశారు. రెండేండ్లుగా బాసర ఆలయ ఈవో రెగ్యులర్‌గా రావడం లేదని, శానిటేషన్ తదితర అంశాలపై భక్తుల నుంచి వస్తున్న ఫిర్యాదు మేర కు.. స్పెషల్ ఆఫీసర్‌గా భైంసా సబ్‌కలెక్టర్‌ను నియమిస్తున్నామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒకరోజు కాకముందే ఆదివారం దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్య ర్ నిర్మల్ కలెక్టర్ ఉత్తర్వులను రద్దు చేస్తూ బాసర ఆలయ ఈవోగా మహబూబ్‌నగర్ అసిస్టెంట్ కమిషనర్ కే అంజనీదేవిని నియమిస్తూ ఉత్తర్వు లు జారీ చేశారు. ఒకరోజు ముందే కొమురవెల్లి ఈవో అన్నపూర్ణ రిటైరవడంతో అంజనీదేవికి అదనపు బా ధ్యతలు ఇచ్చారు. అంజనీదేవిని కొ మురవెల్లి బాధ్యతల నుంచి తప్పి స్తూ.. ఈవోగా డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్‌ను నియమించారు. అంజనీదేవికి ప్రస్తుతం అదనంగా ఉన్న జేవీవో బాధ్యతలను అలాగే కొనసాగిస్తున్నట్టుగా పేర్కొన్నారు.