హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డితో జంతు హక్కుల కార్యకర్త, పీపుల్ ఫర్ యానిమల్స్ అధ్యక్షురాలు మేనకాగాంధీ బృందం భేటీ అయింది. ఆదివారం శాసనసభ సమావేశ హాల్లో జరిగిన భేటీ సందర్భంగా మున్సిపాలిటీల్లో వీధికుక్కల నిర్వహణ, గో సంరక్షణ చర్యలపై అధికారులు మేనకాగాంధీ బృందానికి వివరించారు.
మున్సిపాలిటీలవ్యాప్తంగా వీధి కుక్కలకు నిర్వహిస్తున్న స్టెరిలైజేషన్ ప్రక్రియ వివరాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.