హైదరాబాద్ : బీఆర్ఎస్ ఉద్యమ నాయకులను(BRS leaders) వెంటనే విడుదల చెయ్యాలని ఎప్డీసీ మాజీ చైర్మన్ ఎప్డీసీ అనిల్ కూర్మాచలం(Anil Kurmachalam )డిమాండ్ చేశారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలుసుకోవడానికి వారి ఇంటికి వెళ్లిన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకులని అక్రమంగా ఆరెస్ట్ చెయ్యడాన్ని తీవ్రంగా ఖండి స్తున్నామన్నారు.
వివరాల్లోకి వెళ్తే..హైదరాబాద్‌లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో పాటు మరో 11 మందిపై ఐపీసీ 353, 448 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాల్క సుమన్‌తో పాటు 11 మందిని పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. బీఆర్ఎస్ నాయకులను కోర్టుకు తరలిస్తున్న సమయంలో బంజారాహిల్స్ పీఎస్ ఎదుట బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
1. బాల్క సుమన్
2. మన్నె గోవర్దన్ రెడ్డి
3. కే వాసుదేవా రెడ్డి
4. గెల్లు శ్రీనివాస్ యాదవ్
5. ఆంజనేయ గౌడ
6. కడారి స్వామి యాదవ్
7. తుంగ బాలు
8. డీ రాజు
9. కే జంగయ్య
10. వరికుప్పల వాసు
11. చత్తారి దశరథ్
12. దూదిమెట్ల బాలరాజు యాదవ్