హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): కిరాయి భవనాల్లో నడుస్తున్న అంగన్వాడీలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోకి మార్చేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అధికారులను మం త్రులు సబిత, సత్యవతి రాథోడ్ ఆదేశించారు. అంగన్వాడీ కేం ద్రాలు, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల సంయుక్త నిర్వహణపై గు రువారం మంత్రులు మహిళా, శిశు సంక్షేమశాఖ డైరెక్టరేట్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. మూడు నుంచి ఆరేండ్లలోపు చిన్నారులకు పౌష్టికాహారంతోపాటు నర్సరీ విద్య అందించే ఉద్దేశంతో అంగన్వాడీ కేంద్రాలను పటిష్ఠం చేస్తున్నట్టు చెప్పారు.అనంతరం సేవ్ ద చిల్డ్రన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్టేట్‌హోమ్‌లోని పిల్లలకు మంత్రులు స్టేషనరీ వస్తువులు, బ్యాగులు పంపిణీచేశారు. అంగన్వాడీల సమస్యలపై తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలు నల్లాభారతి స్త్రీ, శిశు సంక్షేమశాఖ కమిషనర్ దివ్యా దేవరాజన్‌కు వినతిపత్రం అందజేశారు.