హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులను సర్కారు బడుల్లో చేర్పించడంపై అధికారులు దృష్టిపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 35,700 అంగన్వాడీలుండగా, 4,52,073 మంది చిన్నారులు నమోదయ్యారు. వీరంతా పూర్వప్రాథమిక విద్యను పూర్తిచేసుకొన్నారు. శనివారం బడిబాట నమోదు డ్రైవ్ ప్రారంభంకాగా, తొలిరోజు నుంచే ఒకటో తరగతిలో చేర్పించేందుకు చర్యలు చేపట్టారు. బడిబాట పర్యవేక్షణకు పాఠశాల విద్యాశాఖ 12 మంది అధికారులను నియమించింది. రెండు జిల్లాలకు ఒకరు చొప్పున బాధ్యతలప్పగించింది. ఈ మేరకు డైరెక్టర్ శ్రీదేవసేన ఉత్తర్వులు జారీచేశారు.