Telangana | తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. కేంద్రం ఇచ్చే ప్రతి అవార్డులోనూ తెలంగాణ రాష్ట్రం ముందు వరుసులో ఉంటుంది. అటు అభివృద్ధి, ఇటు సంక్షేమంలో దూసుకుపోతూ.. పతకాల పంటను పండిస్తున్నది తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు జరగడం లేదని ఆ రాష్ట్రానికి చెందిన సామాన్యులు ప్రశ్నించుకుంటున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా వేండ్రకు చెందిన కృష్ణంరాజు అనే 60 ఏండ్ల వ్యక్తి.. తెలంగాణకు చెందిన శ్రీశైల్ రెడ్డి పంజుగులతో పంచుకున్న అభిప్రాయమిది. కేసీఆర్ వల్లే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యం. ఒకప్పుడు సంగారెడ్డిలో మంచినీళ్లు లేవు. మూడు, నాలుగేండ్ల కింద ఇదే సంగారెడ్డి వెళ్లినప్పుడు పుష్కలంగా మంచినీళ్లు దొరికాయి. కేటీఆర్ అంత మంచి మనసు ఎవరూ లేరు సర్. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ఇలాంటి మంచి మనషులు ఆంధ్రప్రదేశ్‌లో ఉండి ఉంటే అభివృద్ధి చెందేది. కేటీఆర్‌కు ఉన్న పట్టుదల ఎవరికీ లేదు. కేటీఆర్‌కు యూత్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. మాకు ఇక్కడ దారుణ పరిస్థితులు ఉన్నాయి. మోదీ ఏదో చేశానని చెప్తారు. కానీ వేండ్ర రైల్వేస్టేషన్ అభివృద్ధి గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. వంద శాతం చెబుతున్నా.. అభివృద్ధిలో మేం జీరో. కేసీఆర్ లాంటి మంచి మనసు ఉన్న నాయకుడి వద్ద బతకాలనుకుంటున్నాం అని ఆ పెద్దాయన తన మనోగతాన్ని వెల్లడించారు.