Fasal Bima Yojana | హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమ లు చేస్తుంటే.. ఆంధ్రజ్యోతి దినపత్రిక మాత్రం గుడ్డుమీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నది. సంక్షేమ పథకాలను మరిచి.. అదేపనిగా ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమానికి తెరలేపింది. రాష్ట్రంలో ఫసల్ బీమా అమలు చేయకపోవటంతో రైతులకు నష్టం జరుగుతున్నదంటూ తప్పుడు లెక్కలతో గారడీ చేస్తూ ఓ కథనాన్ని వండి వార్చింది. ఈ కథనంలో ఆంధ్రజ్యోతి తీరు రైతులకు కాకుండా.. ఇన్సూరెన్స్ కంపెనీలకు వత్తాసు పలికినట్టుగా స్పష్టమవుతున్నది. ఫసల్ బీమా పథకం ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు మేలు చేసేలా ఉన్నదని దేశంలోని ఆర్థిక, వ్యవసాయరంగ నిపుణులు విమర్శిస్తున్నారు. చాలా రాష్ర్టాలు ఈ పథకాన్ని ఇప్పటికే పక్కనపెట్టేశాయి. అలాంటి పథకాన్ని ఆంధ్రజ్యోతి నెత్తికెత్తుకొని అద్భుతం అంటూ కీర్తించింది.
ఆంధ్రజ్యోతి తన కథనంలో వాస్తవాలను కప్పిపుచ్చుతూ అంకెల గారడీ చేసింది. ఫసల్‌బీమాతో రైతులకు ఎలాంటి నష్టం లేదని సొం త సర్టిఫికెట్ ఇచ్చేసింది. ఫసల్ బీమా ప్రీమి యం చెల్లింపులో కేంద్రం, రాష్ట్ర వాటాతోపాటు రైతుల వాటా కూడా ఉంటుంది. కానీ రాష్ట్రం లో రైతులు, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన వాటా ను పరిగణనలోకి తీసుకున్న ఆంధ్రజ్యోతి.. కేంద్రం వాటాను పరిగణనలోకి తీసుకోకుండా లెక్కలు వేసింది. 2016-17 నుంచి 2019-20 వరకు నాలుగేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ.858.14 కోట్లు, రైతులు రూ.699.59 కోట్లు కలిపి మొత్తం రూ.1,557.73 కోట్లు ప్రీమియం చెల్లించినట్టు రాసింది. ఈ నాలుగేండ్లలో రైతులకు వచ్చిన బీమా సొమ్ము (క్లెయిమ్స్) మొత్తం రూ.1,817 కోట్లుగా లెక్క చెప్పింది.
అంటే రైతులు,రాష్ట్ర ప్రభుత్వం కలిసి చెల్లించిన ప్రీమియంకన్నా రైతులకు రూ.287 కోట్లు అదనంగా లబ్ధి చేకూరినట్టు చెప్పుకొచ్చింది. కానీ, స్వయంగా కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్కలను పరిశీలిస్తే.. తెలంగాణలో ఫసల్ బీమా పథకం కింద 2016-17 వరకు రాష్ట్ర, కేంద్ర, రైతుల వాటా కలిపి మొత్తం రూ.2,415.88 కోట్లు ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లించాయి. రైతులకు వచ్చిన క్లెయిమ్స్ రూ.1,871.54 కోట్లు మాత్రమే. అంటే నాలుగేండ్లలో ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు రూ.544.34 కోట్లు మిగిలాయి. ఈ లెక్కలు చూస్తే లాభం రైతులకు వచ్చిందో! కంపెనీలకు వచ్చిందో ఆంధ్రజ్యోతే చెప్పాలి. మొత్తం ప్రీమియంలో రైతులు రూ.699.59 కోట్లు, కేంద్ర ప్రభుత్వం రూ. 858.15 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.858.14 కోట్లు చెల్లించాయి.
ఫసల్ బీమా పథకం అసంబద్ధమైనదని మొదట్లోనే నిపుణులు తేల్చేశారు. ఈ పథకంలో ఎక్కడైనాసరే 10 మంది రైతులు ఇన్సూరెన్స్ చెల్లిస్తే కేవలం ఇద్దరు లేదా ముగ్గురికి మాత్రమే క్లెయిమ్స్ అందుతున్నాయి. మిగిలినవారు నిజంగా పంటలు నష్టపోయినప్పటికీ బీమా ఇవ్వటంలేదనే విమర్శలున్నా యి. ఇందుకు పథకంలోని కఠిన నిబంధనలే కారణమని చెప్తున్నారు. ఈ పథకంలో రైతును యూనిట్‌గా తీసుకోకుండా ప్రాంతాన్ని యూ నిట్‌గా లెక్కిస్తారు. ఉదాహరణకు ఒక గ్రామం లో వెయ్యి ఎకరాల వరి పంట వేస్తే.. వర్షాలతో 300 ఎకరాల వరి నష్టం జరిగిందనుకోండి.. దీన్ని ఆ ప్రాంతం మొత్తం యూనిట్‌గా తీసుకొని పంట నష్టాన్ని లెక్కిస్తారు. ఒకే ప్రాం తంలో కొన్ని చోట్ల అధిక వర్షం, మరికొన్ని చొట్ల తక్కువ వర్షం పడుతుంది. నష్టాన్ని లెక్కిస్తే పంట నష్టం 33 శాతానికి మించదు. కాబట్టి ఆ గ్రామంలో ఎవరికీ ఫసల్ బీమా కింద పరిహారం ఇవ్వరు. ఈ విధంగా కఠిన, అస్తవ్యస్థ నిబంధనలతో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. దీనికి తోడు కేంద్రం తన వాటా ప్రీమియం చెల్లింపును తగ్గించుకున్నది.
ఫసల్ బీమా పథకాన్ని అమలు చేసిన ప్ర ధాన మంత్రి మోదీ సొంత రాష్ట్రం గుజరాత్.. ఇది పనికిమాలిన పథకమని తేల్చి పక్కనబెట్టేసింది. దీనివల్ల రైతులకు ఎలాంటి లాభం లేద ని, కార్పొరేట్ బీమా కంపెనీలకు మాత్రమే లాభం జరుగుతుందని ఆరోపించింది. దేశంలోని వ్యవసాయ ప్రధాన రాష్ర్టాలైన ఆంధ్రప్రదేశ్, పంజాబ్, బీహార్, పశ్చిమబెంగాల్ కూడా ఫసల్‌బీమా నుంచి బయటకు వచ్చేశాయి. ఈ పథకం మంచిదే అయితే ఇన్ని రాష్ర్టాలు ఎందుకు బయటకు వచ్చాయో ఆంధ్రజ్యోతే చెప్పాలి.
రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు మేలు చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నదని దేశమంతా ఇప్పటికే గుర్తించింది. సీఎం కేసీర్ విప్లవాత్మక నిర్ణయాలతో రాష్ట్రంలో వ్యవసాయం పండుగైంది. ఒకప్పుడు వర్షాధార పంటలు, ఎప్పుడు వ స్తుందో ఎప్పుడు పోతుందే తెలియని కరెంటు, రోజుల తరబడి క్యూలో నిలబడి తుగానీ దొరకని ఎరువులు.. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. రైతులకు మేలు కోసమే నా డు రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ర్టాల మాదిరిగానే ఫసల్ బీమా నుంచి బయటకు వచ్చిందని అధికారులు చెప్తున్నారు. రైతులకు అవసరమైన పద్ధతిలో పంట నష్టపరిహారం ఇ వ్వాలనే కొత్త పంటల బీమా కోసం కసర త్తు చేస్తున్నామని తెలిపారు. ఇది త్వరలోనే అందుబాటులోకి రానున్నదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు సొంతంగా పరిహారాన్ని అందిస్తున్నది. గత నెలలో కురిసిన వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది.
Capture