హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 18 : డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేవలం దళితుల కోసమే పనిచేయడంలేదని, ఆయన అందరి వాడని స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్ (ఎస్ఎస్యూ) హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఎల్తూరి సాయికుమార్ అన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను దళిత నాయకుడిగా చిత్రీకరించడాన్ని ఆయన ఖండించారు. దీన్ని వ్యతిరేకిస్తూ సోమవారం స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో పలువురు హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీ జంక్షన్లో నిరసన తెలిపారు.
ప్రవీణ్‌కుమార్ ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎంతోమంది పేదలకు కులాలు, మతాలకతీతంగా మేలు చేశారని, ఆయన్ను దళిత నాయకుడిగా పేర్కొంటూ అవమానిస్తున్న వేముల రాధాకృష్ణ తన మీడియా ద్వారా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని సాయికుమార్ డిమాండ్ చేశారు. స్వేరోస్ నెట్‌వర్క్‌ను స్థాపించిన ప్రవీణ్‌కుమార్ ఇతర దేశాల్లోనూ విస్తరింపజేసి, పేద ప్రజల పక్షాన నిలుస్తున్న గొప్పవ్యక్తి అని కొనియాడారు.