మేడ్చల్ (నమస్తే తెలంగాణ)/ఘట్కేసర్, నవంబర్11 : ప్రజాకవి అందెశ్రీ అంత్యక్రియలు మంగళవారం ముగిశాయి. ఘట్కేసర్లోని అవుటర్ రింగ్‌రోడ్డు సమీపంలోని స్మృతివనంలో ప్రభు త్వ లాంఛనాలతో తుది వీడ్కోలు పలికా రు. లాలాపేట్‌లోని ఆయన నివాసం నుంచి ఘట్కేసర్ మున్సిపాలిటీ ఎన్‌ఎఫ్‌సీనగర్‌లో ఆయన నిర్మించుకుంటున్న కొత్త భవనం వద్ద పార్థివదేహాన్ని కొద్దిసేపు ఉంచారు. వేలాది మంది అభిమానులు, సాహిత్యాభిమానులు, ప్రజలు, కవులు, కళాకారులు భారీ ర్యాలీగా స్మృతివనానికి తరలివచ్చారు. పోలీసులు గాల్లో కి కాల్పులు జరిపి నివాళులర్పించారు.
సీఎం రేవంత్ మాట్లాడుతూ ‘జయ జయహే తెలంగాణ గీతాన్ని పాఠ్య పుస్తకాల్లో పెడుతామని, ఆయన పుస్తకం ‘నిప్పుల వాగు’ను అన్ని లైబ్రరీల్లో అందుబాటులో ఉంచుతామని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, జూపల్లి కృష్ణారావు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంత్‌రావు, ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, సుధీర్‌రెడ్డి, కలెక్టర్ మనుచౌదరి, విమలక్క, కోదండరాం, సీపీ సుధీర్‌బాబు, కలెక్టర్ మనుచౌదరి, అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవో, అర్అండ్బీ ఈఈ, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.