ఆండాలమ్మ.. నీ మనసు వెన్నమ్మ!

- గొప్ప మనసు చాటుకొన్న వృద్ధురాలు
- బడిపిల్లల కోసం ఆసరా పింఛన్ విరాళం
- అభినందించిన ఉపాధ్యాయులు, గ్రామస్థులు
నంగునూరు, డిసెంబర్ 17 : సర్కారు బడి విద్యార్థుల కోసం ఓ అవ్వ తన ఆసరా పింఛన్ రూ.2016ను విరాళమిచ్చి గొప్ప మనసు చాటుకొన్నారు. కరోనా తర్వాత తెరుచుకొన్న సర్కారు బడిలో సౌకర్యాల కల్పనకు ఉపాధ్యాయుల పిలుపు మేరకు తన నెల పింఛన్ అందజేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రానికి చెందిన సుద్దాల ఆండాలమ్మది నిరుపేద కుటుంబం. ముగ్గురు కూతుర్లు, ఒక కొడుకు. అందరికీ పెండ్లిళ్లు అవ్వగా అందరూ వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. ప్రస్తుతం గ్రామంలో ఆమె ఒక్కరే ఉంటున్నారు. ప్రభుత్వం అందజేస్తున్న ఆసరా పింఛన్ డబ్బులతో ఆమె బతుకు వెళ్లదీస్తున్నారు. అయితే, కరోనా కారణంగా ప్రైవేటు పాఠశాలలు మూతపడి సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు, బోధన పరికరాల కోసం దాతలు ముందుకురావాలని ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆండాలమ్మ తనకు వచ్చిన ఆసరా పింఛన్ రూ.2016 మొత్తాన్ని శుక్రవారం పాఠశాల ఉపాధ్యాయులకు అందజేశారు. పిల్లల భవిష్యత్తు కోసమే తన పింఛన్ డబ్బులను అందజేశానని ఆండాలమ్మ పేర్కొన్నారు.
తల్లిదండ్రుల మీటింగులో ఎవరికి తోచిన విధంగా వారు సహాయం చేయాలని సార్లు అడిగిండ్రు. ఒకరిముఖాలు ఒకరు చూసుకొన్నారే కానీ ఎవరూ ముందుకు రాలె. కరోనా వచ్చి పిల్లల సదువంతా కరాబైపోయింది. వాళ్ల భవిష్యత్తు కోసం నా నెల పింఛన్ ఇయ్యాలి అనిపించింది. వెంటనే పింఛన్ తీసుకపోయి సార్లకు అప్పజెప్పిన. మన పిల్లలు బాగా
చదువుకొని, మంచి ఉద్యోగాలు చేయాలి. ఊరి బడిని బాగు చేసుకొనేందుకు అందరూ తోచినకాడికి సాయం చేయాలి.
- సుద్దాల ఆండాలమ్మ, నంగునూరు, సిద్దిపేట జిల్లా
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- andalamma
- Telangana News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

