జగదేవ్‌పూర్, డిసెంబర్ 25: సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండల కేంద్రంలో కొత్త రాతియుగానికి చెందిన ఆదిమానవుల ఆవాసం ఆనవాళ్లు గుర్తించినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్, సభ్యుడు ప్రణయ్‌కుమార్ తెలిపారు. క్రీ.పూ. 5000 నాటికే జగదేవ్‌పూర్‌లో మానవవికాసం జరిగినట్టు ఆనవాళ్లు ఉన్నాయన్నారు. గ్రామానికి తూర్పు వైపు తక్కువ ఎత్తులో రాతి పరుపుగుట్ట ఆది మానవుల ఆవాసం అని, ఇక్కడే 8చోట్ల వారు వాడిన రాతి గొడ్డలి, నూరుడు గుంటలు వేటకు ఉపయోగించిన ఆయుధాలు లభించినట్టు పేర్కొన్నారు. 14.50 మీటర్ల వ్యాసం తో రెండు వరుసలతో పేర్చిన రాతి ఉగండ్లు, బంతిరాళ్ల తో విశాలంగా ఉన్న అరుదైన సమాధిని గుర్తించామన్నారు.