మునిపల్లి, జూన్ 16: ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన పంచాయతీ కా ర్యదర్శి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. మెదక్ రేంజ్ డీ ఏస్పీ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకా రం.. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుధేరాకు చెందిన ఓ వ్యక్తి రేకుల షెడ్డు, కరెంట్ మీటర్ కోసం జీపీలో దరఖాస్తు చే సుకున్నాడు. పని పూర్తికావాలంటే రూ. 12వేలు అవుతుందని పంచాయతీ కార్యదర్శి నాగలక్ష్మి తెలుపడంతో బాధితుడు రూ.10వేలకు ఒప్పందం కుదుర్చుకున్నా డు. సోమవారం బుధేరా జీపీ కార్యాలయంలో బాధితుడి వద్ద కార్యదర్శి నాగలక్ష్మి రూ.8వేలు లంచం తీసుకుంటుండ గా ఏసీబీ అధికారులకు చిక్కారు. కార్యదర్శిని మునిపల్లి మండల పరిషత్ కార్యాలయానికి తరలించి వివరాలు సేకరించారు.