హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): నల్లమలలో అరుదైన అతిచిన్న జింక జాతి (చింకారాల) మనుగడకు ముప్పు పొంచి ఉన్నది. దేశంలోని థార్ ఎడారితోపాటు కర్ణాటకలోని యాడహల్లి అభయారణ్యంలో మాత్రమే కన్పించే అరుదైన చింకారాలు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని మద్దిమడుగు రేంజ్లో పదుల సంఖ్యలో ఉన్నాయి.
మద్దిమడుగు ప్రాంతంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పబ్బతి ఆంజనేయస్వామి ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు నల్లమలలో వేలసంఖ్యలో ఆవుల మందలను వదులుతున్నారు. చిన్నిచిన్న మొక్కలు, నేలపై తక్కువ ఎత్తులో ఉండే గడ్డి మాత్రమే చింకారాలకు ఆహారం. కాగా, ఈ ప్రాంతంలో సంచరిస్తున్న ఆవుల మందలతో ఆహారపు పోటీ నెలకొన్నది. స్థానిక గ్రామాల నుంచి కాకుండా నల్లగొండలోని కంభాలపల్లి, చందంపేట పరిసర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో ఆవుల మందలను కృష్ణా తీరంలోని నల్లమలలో వదులుతున్నారు. దీంతో జంతువుల నుంచి వన్యప్రాణులకు సంక్రమించే జూనోసిస్ వ్యాధులకు చింకారాలు లోనయ్యే అవకాశం ఉన్నది.
చింకారా జాతి జింకలు కనుమరుగయ్యే దశలో ఉన్నాయి. పూర్తిగా గడ్డి మైదానాలు, పొదలతో కూడి న అడవుల్లో నివసించేందుకే చింకారాలు ఇష్టపడతాయి. అతి సున్నితమైన ఈ జీవులకు వేట, మానవ సంచారం, ఇతర జంతువులతో ముప్పు ఉందని అటవీ అధికారులు చెబుతున్నారు.
చింకారాలు నల్లమలలో ఉన్నాయి. జింక జాతికి చెందిన ఈ ప్రాణులు అతి సున్నితమైనవి. పులుల సంతతి పెరిగేందుకు, జీవవైవిధ్యంలో వీటి పాత్ర కీలకం. నల్లమల అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో వీటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం.
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందూ, ముస్లిం గొడవలుగా చిత్రీకరించేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి విమర్శించారు. సాయుధ పోరాటానికి మతం రంగు పులి మే బీజేపీ కుటిల ప్రయత్నాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ట్యాంక్‌బండ్‌పై సీపీఐ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల ఫొటో ఎగ్జిబిషన్‌ను చాడ వెంకట్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ విలీన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని, హైదరాబాద్‌లో తెలంగాణ సాయుధ పోరాట యోధుల సృ్మతి వనాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ చరిత్రను వక్రీకరించి రాసిన వారికి కనువిప్పు కలిగేలా వాస్తవాలను తెలియజేస్తూ చరిత్రను తిరిగి రాస్తామన్నారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ సాయుధ పోరాట ఫలితంగా పేదలకు 10 లక్షల ఎకరాల భూ పంపిణీ జరిగిందన్నారు.