హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగం మారుస్తామంటూ వ్యాఖ్యానించిన ఎంపీ అనంత్హెగ్డేను బీజేపీ నుంచి బహిష్కరించాలని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్‌మాదిగ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాజ్యంగం జోలికొస్తే చూస్తూ ఊరుకోబోమని పేర్కొన్నారు. గతంలో కూడా హెగ్డే కేంద్ర మంత్రి హోదాలో ఇలాంటి వాఖ్యలే చేసినప్పటికీ ఆనాడు కూడా అతనిపై బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.
ఆయనపై బీజేపీ వ్యవహరిస్తున్న మెతక వైఖరికి కారణం ఆయనను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నట్టుగానే భావించాల్సి వస్తుందన్నారు. యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్కను చిన్నపీటపై కూర్చోబెట్టి సీఎం ఇతర మంత్రులు అవమానించారని సునీల్‌మాదిగ ఆరోపించారు. దళితులను అవమానించడమే కాంగ్రెస్ పార్టీ నైజమా, భట్టికి లేని హోదా మంత్రులు కోమటిరెడ్డికి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఎక్కడిదని ప్రశ్నించారు.