రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల(Siricilla Dis) జిల్లా రుద్రంగిలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accicent) జరిగింది. రుద్రంగి గ్రామ శివారులో ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు(RTC bus) ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు యువకుల్లో గండి అజయ్(19)అక్కడికక్కడే మృతి చెందాడు. బోయిని సంతోష్ అనే మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని హాస్పిటల్కు తరలించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అజయ్ మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.