నల్లగొండ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : నల్లగొండలో అత్యాధునిక సదుపాయాలతో విశాలమైన ఆఫీసు స్పేస్తో ఐటీ టవర్ సిద్ధమైంది. టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో 90 కోట్లతో పూర్తిగా గ్రీన్ బిల్డింగ్ తరహాలో దీన్ని నిర్మించారు.
తొలి దశలో 17 కంపెనీలు 1,200 మందికి ఉపాధి కల్పించేలా ఇప్పటికే రిక్రూట్మెంట్లు కూడా పూర్తి చేసినట్లు తెలిసింది.