హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నుంచి ఏపీలోని గన్నవరం బయలుదేరి వెళ్లిన ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం ల్యాండింగ్ సమయంలో వీల్ తెరుచుకోలేదు. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెంటనే టేకాఫ్ చేశారు.
సుమారు 20 నిమిషాలపాటు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత వీల్ తెరచుకోవడంతో సేఫ్గా ల్యాండ్ అయ్యింది. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, ఇతర ప్రయాణికులంతా సురక్షితంగా బయటకు వచ్చారు.