మక్తల్, జూలై 10 : బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్తపై కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడిన ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకున్నది. బాధితుడి కథనం ప్రకారం.. మక్తల్ మండలం ఉప్పర్పల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త భద్రప్ప గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో మక్తల్ పట్టణం నుంచి సొంతూరుకు బైక్పై బయలుదేరాడు. దాదా పు 20 మంది అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు దారికాచి మారణాయుధాయులతో అటకాయించి భద్రప్పపై దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికు లు గుర్తించి దవాఖానకు తరలించారు. దాడికి పాల్పడిన వారిపై పోలీసులకు బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నదని పలువురు ఆరోపించారు. మహబూబ్నగర్ దవాఖానలో భద్రప్పను మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం పరామర్శించారు.
బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ గూండాల దా డులతో పేట్రేగిపోతున్నారని మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రప్పపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మక్తల్ పోలీస్స్టేషన్ ఎదుట పార్టీ నాయకులతో కలిసి నిరసన తెలిపారు. కాంగ్రెస్ వచ్చా క దాడులు పెరిగాయని ఆరోపించారు. రెండు నెలల కిందటే గ్రామంలో జరిగిన చిన్న గొడవకు కారణమైన వ్యక్తులను అరెస్టు చేయకుండా మక్తల్ పోలీసులు.. మం త్రి చెప్పుడు మాటలు వింటూ వారికి కొమ్ముకాయడం వల్లే ఈ ఘటన జరిగిందని మండిపడ్డారు.