హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నేత మధుయాష్కీగౌడ్ అనుచరులు ఢిల్లీలో వీరంగం వేశారు. ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో మీడియాతో మా ట్లాడుతున్న కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ గోనె ప్రకాశ్‌పై దాడికి ప్రయత్నించారు. మధుయా ష్కీ గురించి మాట్లాడితే సహించేది లేదంటూ దుర్భాషలాడారు. కుర్చీలు పైకెత్తి దాడి చేసేందుకు ప్రయత్నించారు. అక్కడి మీడియా ప్రతినిధులు కలుగజేసుకుని శాంతిపజేశారు.
అమెరికాలో అంట్లు తోమాడేమో?
మధుయాష్కీ ఎంతోమందిని మోసగించాడని, త్వరలోనే జైలుకెళ్లడం ఖాయమని గోనె ప్రకాశ్ పేర్కొన్నారు. న్యూయార్లో ఒక అటార్నీని మోసం చేసినందుకు అక్కడి కోర్టు లాయర్‌గా ప్రాక్టీస్ చేయకుండా నిషే ధం విధించిందని తెలిపారు. మధుయాషీ అమెరికాలో అంట్లు తోమారేమోనని ఎద్దేవా చేశారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి దగ్గ ర మధుయాష్కీ చిట్టా ఉన్నదని, అవకాశాన్ని బట్టి అన్నీ బయట పెడతారని హెచ్చరించారు. ఎల్బీనగర్లో మధుయాష్కీకి డిపాజిట్లు రావని, అతడి వల్ల కాంగ్రెస్ మరో 10 సీట్లు కోల్పోతుందని చెప్పారు.