తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. జీహెచ్ఎంసీ పరిధిలోని మెజార్టీ నియోజకవర్గాల్లో అధికార బీఆర్ఎస్ మరోసారి పట్టు నిలుపుకుంది. అంబర్పేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నారు. 11 రౌండ్లు పూర్తయ్యే సరికి బీఆర్ఎస్ 18,228 ఓట్ల మెజార్టీతో ఉన్నారు.