హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సచివాలయానికి అంబేదర్ పేరు పెట్టడంతోపాటు 125 అడుగుల అంబేదర్ విగ్రహాన్ని ఆవిషరించినందుకుగాను ‘ది ప్రాక్టీసింగ్ బుద్దిస్ట్ సొసైటీ’ (బౌద్ధ ఉపాసక్ మహాసభ) సీఎం కేసీఆర్కు అభినందనలు తెలిపింది. ఈ మేరకు లక్నో నుంచి సొసైటీ ప్రధాన కార్యదర్శి కేఆర్ రావత్ కేసీఆర్కు ప్రశంస లేఖ పంపారు. ‘సచివాలయానికి అంబేదర్ పేరు పెట్టి, పకనే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిషరించడం గొప్ప విషయం. మీరు వేసిన అడుగు అంబేదర్ భావజాలాన్ని విశ్వసించే వారికి సంతోషాన్ని కలిగిస్తున్నది. గొప్ప కార్యాన్ని చేపట్టిన మీకు, బౌద్ధ ఉపాసక్ మహాసభ కోటికోటి అభినందనలు తెలియ జేస్తున్నది. అనునిత్యం ఇటువంటి విశిష్టమైన కార్యక్రమాలు చేపట్టేలా, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం మరింతగా కృషి కొనసాగించేలా, మీకు సదా ఆయురారోగ్యాలను సుఖసంతోషాలను, శక్తిని ప్రసాదించా లని, బుద్ధ భగవానున్ని ప్రార్థిస్తున్నాం’ అంటూ లేఖలో పేరొన్నారు.