హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ల గడువు తేదీ పొడిగిస్తూ వర్సిటీ ఉన్నతాధికారులు బుధవారం నిర్ణయం తీసుకున్నారు.
డిగ్రీ, పీజీ, డిప్లొమాతోపాటు పలు రకాల సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రస్తుత విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 30 వరకు గడువు పొడిగించినట్టు ప్రకటించారు. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా ఫీజు చెల్లించి అడ్మిషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం వర్సిటీ వెబ్సైట్ను www.braouonline.in సంప్రదించాలని సూచించారు.