హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో భారీ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు చరిత్రలో సువర్ణాధ్యాయమని ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ శాఖ అధ్యక్షుడు రాధారపు సతీశ్‌కుమార్, ప్రధాన కార్యదర్శులు రాజేందర్ మగ్గిడి, సుమన్ అన్నారం పేర్కొన్నారు. ఇది తెలంగాణ సమాజానికే గర్వకారణమని తెలిపారు.
రాష్ట్ర సచివాలయానికి బీఆర్ అంబేదర్ పేరు పెట్టినందుకు సీఎం కేసీఆర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకొచ్చి విప్లవాత్మకమైన మార్పునకు నాంది పలికారని పేర్కొన్నారు. నిరుపేద దళిత కుటుంబాలకు ఏకంగా రూ.10 లక్షల చొప్పున అందించి వారికి శాశ్వత ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని కొనియాడారు.