హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ) : కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ధూంధాం నిర్వహించనున్నట్టు కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరుశురామ్ తెలిపారు. మంగళవారం రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రకు సంస్థ ప్రతినిధులు ఢిల్లీలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఆహ్వానం అందజేశారు. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ.. అంబేద్కర్, భారత రాజ్యాంగంపై బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు ఎంతో గౌరవం ఉందన్నారు. మార్చి 26న జరిగే ధూంధాంలో తప్పక పాల్గొంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆళ్ల రామకృష్ణ దత్తు, రాకేశ్, చతుర్బుజ్ పాల్గొన్నారు.