ఆమనగల్లు, ఆగస్టు 19: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు తహసీల్దార్ లలిత , సర్వేయర్ కోట రవి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. హైదరాబాద్ రేంజ్ -2 ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ వివరాల ప్రకారం ఆమనగల్లు మండలంలోని గ్రామానికి చెందిన రైతు పట్టాదారు పాసుపుస్తకంలో జెండర్ సవరణ కోసం తహసీల్దార్ లలితను ఆశ్రయించగా ఆమె రూ. లక్ష లంచం డిమాండ్ చేశారు. డీఎస్పీ , సీఐలు మంగళవారం ఆర్డీవో సమక్షంలో తహసీల్దార్ కార్యాలయంలో సోదా చేసి తహసీల్దార్ లలిత, సర్వేయర్ రవిని అరెస్టు చేశారు.
ఇంటి నంబర్‌కు 15వేలు..
తాండూరు, ఆగస్టు 19: వికారాబా ద్ జిల్లా తాండూరుకు చెందిన బాధితుడు తన షెడ్‌కు నంబర్ కోసం మున్సిపల్ అధికారులను సంప్రదించగా సీనియర్ అసిస్టెంట్ రమేశ్ రూ. 20 వేలు లంచం డిమాండ్ చేశారు. రమేశ్‌కు బాధితుడు రూ. 15వేలు ఇస్తుండగా ఏసీబీ బృందం పట్టుకున్నారు. రమేశ్‌ను రిమాండ్‌కు తరలించినట్టు ఏసీబీ అధికారి ఆనంద్ తెలిపారు.