కరీంనగర్ కమాన్చౌరస్తా, మే 11 : ఎప్సెట్-2025 ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచినట్టు విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్రెడ్డి తెలిపారు. కరీంనగర్లోని వావిలాలపల్లిలోగల టైనిటాట్స్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. వెయ్యిలోపు 33 మంది, 2000 వరకు 72 మంది, 3000లోపు 105 మంది, 5000లోపు 192 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించి అల్ఫోర్ కీర్తి ప్రతిష్టలను దశదిశలా చాటారని చెప్పారు.
తకువ మంది విద్యార్థులతో అత్యధిక ర్యాంకులు సాధించడం అల్ఫోర్స్కు మాత్రమే సాధ్యమని ఈ ఫలితాలు తెలియజేశాయని పేర్కొన్నారు. ఇదే క్రమంలో ఇటీవల ప్రకటించిన ఐఐటీ ఫలితాల్లో ప్రతిభ కనబర్చి 461 మంది అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని, అడ్వాన్స్డ్ ఫలితాల్లోనూ తమ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయి ర్యాంకులు సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. అలాగే, నీట్ ఫలితాల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరుస్తారని విశ్వసిస్తున్నట్టు చెప్పారు.