హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): రేవంత్‌రెడ్డి కక్ష సాధింపులో భాగంగానే పోలీసులు అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. రేవంత్ మూల్యం చెల్లించుకోక తప్పదని ఓ ప్రకటనలో హెచ్చరించారు. ప్రభుత్వ అసమర్థత, పోలీసు వైఫల్యంతోనే తొక్కిలాసటలో మహిళ చనిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. కేసును ఎత్తేసి అల్లు అర్జున్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): అల్లు అర్జున్ అరెస్ట్ ప్రభుత్వ కక్షసాధింపేనని మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. చంద్రబాబును సంతోషపెట్టేందుకే అర్జున్ను అరెస్ట్ చేసినట్టు కనిపిస్తున్నదని ఆరోపించారు. సినీపరిశ్రమపై వరుస దాడుల వెనుక పెద్ద కుట్ర ఉన్నదని, సినీ పరిశ్రమ దెబ్బతింటే వేల కుటుంబాలు రోడ్డున పడుతాయని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): లగచర్ల రైతుకు బేడీలు వేసిన ఘటనను పక్కదారి పట్టించేందుకే ప్రభుత్వం అల్లు అర్జున్ అరెస్ట్ డ్రామాకు తెరతీసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఆరోపించారు. చట్టం తనపని తాను చేసుకుపోతుందని కాంగ్రెస్ నేతలు చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి సూసైట్ నోట్లో రేవంత్‌రెడ్డి, అతడి అన్నదమ్ముల పేర్లు రాశారని, వాళ్లను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు.