వర్చువల్‌గా కోర్టుకు హాజరైన అల్లు అర్జున్
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రాంరెడ్డి సోదరులతోపాటు 20మంది సోమవారం కోర్టు ఎదుట హాజరయ్యారు.
- జూలై 6కు విచారణ వాయిదా
నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జూన్ 22 (నమస్తే తెలంగాణ): సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రాంరెడ్డి సోదరులతోపాటు 20మంది సోమవారం కోర్టు ఎదుట హాజరయ్యారు. ఈ కేసులో ఏ11గా ఉన్న అల్లు అర్జున్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలో పాల్గొన్నారు. అల్లు అర్జున్ తరఫున న్యాయవాది అశోక్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో కోర్టు అనుమతినివ్వడంతో న్యాయవాది అశోక్‌రెడ్డి అల్లు అర్జున్‌కు వీడియో కాల్ చేసి మెజిస్ట్రేట్‌కు అందించారు. తదుపరి విచారణ జూలై 6కు వాయిదా పడిందని అల్లు అర్జున్‌కు జడ్జి సూచించారు. వచ్చే వాయిదాకు కమిటల్ బాండ్ (జిల్లా కోర్టుకు కేసు బదిలీ) సమర్పించాలని కోర్టు ఆదేశించింది. కేసులో ఉన్న 23 మంది తరఫున న్యాయవాదులు వకాల్తా దాఖలు చేయగా కోర్టు అంగీకరించింది. పీఆర్సీ 264 ఆఫ్ 2026 నంబరు గల ఈ కేసు జిల్లా కోర్టుకు బదిలీ కానున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

