హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ సంస్థకు సంబంధించిన రూ.100 కోట్ల బ్యాంకు కుంభకోణం కేసులో ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. ఆయనను అధికారులు 3 గంటలపాటు ప్రశ్నించారు. యూనియన్ బ్యాంక్ నుంచి రూ.100 కోట్లకుపైగా అప్పు తీసుకుని ఎగ్గొట్టిన రామకృష్ణ ఎలక్ట్రానిక్స్‌తో అల్లు అరవింద్‌కు, ఆయన కంపెనీలకు ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. ఆ లావాదేవీలపై ప్రశ్నించిన ఈడీ అధికారు లు.. వచ్చే వారం మళ్లీ విచారణకు రావాలని ఆయనను ఆదేశించారు.