వేములవాడ టౌన్, డిసెంబర్ 4: వేములవాడ రాజన్న ఆలయ ధర్మగుండంలో పుణ్యస్నానాలకు ఆదివారం నుంచి అనుమతినిచ్చారు. కరోనా నేపథ్యంలో 2020 ఫిబ్రవరి 19న నిలిపేసిన పుణ్యస్నానాలను దాదాపు 34 నెలల తర్వాత ఆదివారం పునఃప్రారంభించారు. ఉదయం 8 గంటలకు ధర్మగుండంలో ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో అర్చకులు పుణ్యాహవాచనం, గణపతిపూజ నిర్వహించారు. అనంతరం కరోనా నివారణ సంప్రోక్షణ పూజలు చేశారు. తర్వాత అర్చకులు, ఆలయ సిబ్బంది స్నానాలు ఆచరించారు. అనంతరం ధర్మగుండంలోని పవిత్ర జలంతో శ్రీపార్వతీ రాజరాజేశ్వర స్వామివారికి అభిషేకం చేశారు. ఆ తరువాత భక్తులు గుండంలో స్నానాలు ఆచరించి పులకించిపోయారు.