గాలీవాన బీభత్సం
ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలుచోట్ల చెట్లు విరిగి రోడ్లపై పడగా, మరికొన్ని చోట్ల ఇండ్లపైకప్పులు ఎగిరిపడ్డాయి. పొతంగల్ మండలం తిర్మలాపూర్, కోటగిరి మండలంలోని ఎత్తొండ క్యాంప్‌లో పలువురి ఇండ్ల పైకప్పులు ఎగిరిపడ్డాయి.
- ఉమ్మడి జిల్లాలో భారీ వర్షం
- కల్లాల్లో తడిసిన జొన్నలు
- ఎగిరిపోయిన ఇంటిపైకప్పులు
కోటగిరి (పొతంగల్)/గాంధారి/బిచ్కుంద/ సిరికొండ, జూన్ 7: ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలుచోట్ల చెట్లు విరిగి రోడ్లపై పడగా, మరికొన్ని చోట్ల ఇండ్లపైకప్పులు ఎగిరిపడ్డాయి. పొతంగల్ మండలం తిర్మలాపూర్, కోటగిరి మండలంలోని ఎత్తొండ క్యాంప్‌లో పలువురి ఇండ్ల పైకప్పులు ఎగిరిపడ్డాయి. మరికొందరి ఇండ్లపై చెట్లు పడగా ఇంట్లో ఉన్న సామాన్లు ధ్వంసమయ్యాయి. కొందరు తమ ఇండ్లల్లోకి వర్షపు నీరు చేరిందని వాపోయారు. ఎత్తొండ క్యాంప్‌లో ఓ తాటిచెట్టుపై పిడుగు పడింది.
గాంధారి మండలం బూర్గుల్ గ్రామంలో ఈదురు గాలులకు కంపోస్ట్ షెడ్డు కూలిపోయింది. గాంధారి మండలంతోపాటు బిచ్కుంద మండలంలోని పలు గ్రామాల్లో కల్లాలు,కొనుగోలు కేంద్రాల వద్ద ఉంచిన జొన్న కుప్పలు వర్షానికి తడిసిపోయాయి. పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు నానా అవస్థలు పడాల్సి వచ్చింది. జొన్నల కుప్పల వద్దకు వర్షపు నీరు చేరకుండా కాలువలు తీసి తంటాలు పడ్డారు. ఈదురుగాలులకు బిచ్కుంద-బాన్సువాడ రహదారిపై చెట్లు నేలకొరిగాయి. దీంతో వాహనదారులకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సిరికొండలో మూడు గంటలపాటు వర్షం కురిసింది.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

