హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): కొంతకాలంగా ఆర్టీసీలో కొన్ని వేల ఉద్యోగాలు భర్తీచేస్తున్నామని ఎవరి ఇష్టారీతిన వాళ్లు ఇచ్చిన ప్రకటనలన్నీ మోసపూరితమైనవేనని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎన్నో ఏండ్లతరబడి నుంచి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత ఆశల మీద నీళ్లు చల్లినట్టుగా ఆర్టీసీలో అన్ని ఖాళీలను అవుట్సోర్సింగ్ / కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలు చేపడుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం నిరుద్యోగులు ఓ ప్రకటన విడుదల చేశారు.