వండర్‌హాట్ మిర్చికి రికార్డు ధర
రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ మారెట్లో ఎర్ర బంగారం (ఎండుమిర్చి)ధరలు రోజురోజుకూ ఎగబాగుతున్నాయి. వరంగల్‌లోని ఏనుమాముల, హైదరాబాద్‌లోని మలక్‌పేట, నిజామాబాద్ వంటి వ్యవసాయ మారెట్ యార్డుల్లో మిర్చి ధరలు పెరుగుతూ వస్తున్నాయి.
- ఎనుమాముల మార్కెట్లో క్వింటాల్ రూ.37,100
హైదరాబాద్/కాశీబుగ్గ, ఫిబ్రవరి 4 : రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ మారెట్లో ఎర్ర బంగారం (ఎండుమిర్చి)ధరలు రోజురోజుకూ ఎగబాగుతున్నాయి. వరంగల్‌లోని ఏనుమాముల, హైదరాబాద్‌లోని మలక్‌పేట, నిజామాబాద్ వంటి వ్యవసాయ మారెట్ యార్డుల్లో మిర్చి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో బుధవారం వండర్‌హాట్ రకం మిర్చికి రికార్డు స్థాయి ధర పలికింది. గత నాలుగేండ్లలో అత్యధికంగా క్వింటాల్ రూ.37, 100 ధర పలికినట్టు అధికారులు తెలిపారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం నీలంపల్లికి చెందిన రైతు ఆర్ వినోద్ ఎనుమాముల మార్కెట్‌కు 80 బస్తాల వండర్‌హాట్ మిర్చి తీసుకొచ్చాడు. కీర్తన అడ్తి ద్వారా భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ ఖరీదు వ్యాపారి అత్యధిక ధరకు కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు. క్వింటాల్ అత్యధికంగా రూ.37, 100, మధ్యరకానికి రూ.30వేలు, కనిష్ఠంగా రూ.15 వేలు ధర పలికినట్టు అధికారులు తెలిపారు. ధరలు ఎక్కువగా పలుకడంతో రైతులు సంతోషం వ్యక్తంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

