వరంగల్ : ఎర్ర బంగారం(Mirchi) ఘాటెక్కింది. రాష్ట్రంలో బంగారంతో పాటు మిర్చి ధరలు పోటీ పడి పెరుగుతున్నాయి. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి, దేశి మిర్చికి రికార్డు స్థాయిలో ధర పలికింది. క్వింటాల్ సింగిల్ పట్టి మిర్చి ధర రూ.40,000. పత్తి ధర రూ. 10,100. మిర్చి, పత్తికి ఇంత ధర పలకడం మార్కెట్ చరిత్రలో ఇదే తొలిసారని మార్కెట్ వర్గాలు తెలిపాయి. కాగా, ఆరుగాలం శ్రమించిన రైతులకు కాసుల వర్షం కురుస్తుండటంతో సంతోషిస్తున్నారు.