Kothagudem | బొగ్గుబాయి సంక్షేమానికి గీటురాయి.. బీఆర్ఎస్ హయాంలో కొత్తగూడేనికి మహర్దశ
సింగరేణి సిగలో విరజిమ్మిన సెగలు తెలంగాణ ఉద్యమ వేడిని పెంచాయి. తొడలు విరిచి గనులు తొలిచే కార్మికులంతా ముక్తకంఠంతో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ఎలుగెత్తి చాటారు.
- అభివృద్ధి పథంలో నడిపించిన ఎమ్మెల్యే ‘వనమా’
Kothagudem | సింగరేణి సిగలో విరజిమ్మిన సెగలు తెలంగాణ ఉద్యమ వేడిని పెంచాయి. తొడలు విరిచి గనులు తొలిచే కార్మికులంతా ముక్తకంఠంతో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ఎలుగెత్తి చాటారు. తెలంగాణ ఏర్పాటయ్యాక బొగ్గుబాయిలో యేటా సంబురాలే. యేటికేడూ రెట్టించిన బోనసులే! కొత్తగూడెం పరిధిలోని సింగరేణితోపాటు నియోజకవర్గంలోని పల్లెలన్నీ అభివృద్ధితోపాటు సంక్షేమాన్నీ బోనస్‌గా అందుకుంటున్నాయి.
కొత్తగూడెం నియోజకవర్గం 1978లో ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా 2014లో టీఆర్ఎస్ గులాబీ జెండా ఎగిరింది. కొత్తగూడెం నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా జలగం వెంకటరావు విజయఢంకా మోగించి చరిత్రను తిరగరాశారు.
2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన వనమా వెంకటేశ్వరరావు, అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకటరావుపై విజయం సాధించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధిని చూసి వనమా వెంకటేశ్వరరావు టీఆర్ఎస్లో చేరారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నాలుగేండ్లలో నియోజకవర్గ రూపురేఖలు మార్చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం కొత్త కలెక్టరేట్ భవనాన్ని నిర్మించింది. ముర్రేడు వాగు రిటెయినింగ్ వాల్‌కు రూ.36 కోట్ల నిధులు మంజూరు చేయించారు. పాల్వంచ దవాఖానను 50 నుంచి 100 పడకలకు అప్‌గ్రేడ్ చేశారు. రూ. 3 వేల కోట్లతో రహదారులు, డ్రెయిన్లు, చెక్‌డ్యాంలు, సెంట్రల్ లైటింగ్, మున్సిపాలిటీల్లో డివైడర్లు నిర్మిం చారు. కొత్త గ్రామపంచాయతీలకు భవనాలతో పాటు మున్సిపల్ పరిధిలో పేద కుటుంబాలకు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. 2018 నుంచి ఇప్పటి వరకు 55 మంది రైతులు మృతి చెందగా వారి కుటుంబాలకు రూ. 25.25 కోట్లు పరిహారాన్ని అందజేశారు. రైతువేదికలు, పల్లెప్రకృతి వనాలు, కొత్త జీపీ భవనాలు, శ్మశానవాటికలు, డంపింగ్ యార్డులు, పంట కల్లాలను అందుబాటులోకి తెచ్చారు. కొత్త మండలాలకు కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. చరిత్రలో నిలిచి పోయేలా 55 వేల మంది పోడు రైతులకు పట్టాలు ఇచ్చారు.
కొత్తగూడెంలో వైద్య విప్లవం
ప్రభుత్వం జిల్లాకు మెడికల్ కాలేజీతో పాటు నర్సింగ్ కాలేజీని మంజూరు చేసింది. కొత్తగూడెం ఏరియా దవాఖానను జిల్లా ఆసుపత్రిగా మార్చింది. రామవరంలో వందపడకలతో మాతాశిశు ఆరోగ్య కేంద్రా న్ని ఏర్పాటు చేసింది. కొత్తగూడెంలో డయాలసిస్ కేంద్రాన్ని నెలకొల్పడంతో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఊరటనిస్తున్నది.
బీఆర్ఎస్కు జై కొడుతున్న ప్రజలు
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ వనమా వెంకటేశ్వరరావు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మూడు మండలాల జడ్పీటీసీలు, నాలుగు మండలాల ఎంపీపీలు, సర్పంచ్‌లు, జడ్పీ చైర్మన్ కూడా బీఆర్ఎస్ వారే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అభివృద్ధిని చూసి కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్ష పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారు. దీంతో బీఆర్ఎస్ గ్రాఫ్ భారీ గా పెరిగిపోయింది. నల్లనేలపై మరోమారు గులాబీ జెండా రెపరెపలాడనున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ఎమ్మెల్సీ ఓటు నమోదులో పాల్గొన్న కంచర్ల రామకృష్ణారెడ్డి
‘మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి’
ENE Repeat | ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ ట్రైలర్ అప్డేట్.. వచ్చేస్తోన్న మ్యాడ్ గ్యాంగ్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

