హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ శాసనసభలో ముగ్గురు అతిపిన్నవయస్కులు అడుగుపెట్టనున్నారు. వారిలో అందరి కం టే తక్కువ వయస్సు కలిగిన ఎమ్మెల్యేగా పాలకుర్తి నుంచి గెలుపొందిన మామిడాల యశస్వినిరెడ్డి (26), మెదక్ నుంచి విజయం సాధించిన మైనంపల్లి రోహిత్ (26) రికార్డు సృష్టించారు.
తర్వాతి స్థానాల్లో నారాయణపేట నుంచి గెలుపొందిన డాక్టర్ పర్ణికారెడ్డి (30), కంటోన్మెంట్ నుంచి ఎన్నికైన లాస్యనందిత (36) ఉన్నారు. వీరంతా తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.