హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): గ్రీన్ ఇండియా చాలెంజ్ ఉద్యమంతో పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్.. ప్రజలను ఆలోచింపజేసే ట్వీట్ చేశారు. ఆల్ ఫూల్స్ డేని ఆల్ కూల్ డేగా మారుద్దామని పిలుపు ఇచ్చారు. ఏప్రిల్ 1న ప్రతి ఒక్కరూ తమ పరిచయస్తులకు ఒక మొక్క బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరచడంపై ఆలోచించాలన్నారు.