హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలన్నీ విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశా రు. బుధవారం ప్రకటన విడుదల చేశారు. బీసీ సంక్షేమశాఖకు కేవలం రూ.1502 కోట్లు విడుదల చేయడం తో సరిపోదని, బకాయిలన్నీ విడుదల చేస్తేనే విద్యార్థుల స్కాలర్షిప్ సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. మూసీ సుందరీకరణకు 1.50 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలని చూస్తున్న ప్రభుత్వానికి.. విద్యార్థుల కోసం పెట్టే 3 వేల కోట్లు భారమా? అని ప్రశ్నించారు.
నేడు పరువు నష్టం దావాపై విచారణ ;రెండో సాక్షి వెంకటేశ్వర్లు వాంగ్మూలం
నాంపల్లి కోర్టులు, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): మంత్రి కొండా సురేఖపై అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావాపై గురువా రం విచారణ కొనసాగనుంది. రెండో సాక్షిగా వెంకటేశ్వర్లు తన వాంగ్మూ లం నమోదు చేసే అవకాశం ఉంది. కోడలు సుప్రియ సాక్ష్యం సరిపోతుందని కోర్టు భావిస్తే కేసు నమోదుకు తదుపరి చర్యలు చేపడుతుంది. ఈ కేసులో పెన్‌డ్రైవ్, పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్‌లు, సోషల్ మీడియాలోని కథనాలను నాగార్జున తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి కోర్టుకు సమర్పించారు. వాటిని పరిశీలించిన పిద ప కేసు నమోదుకు కోర్టు చర్యలు చేపట్టనుంది. అనంతరం మంత్రికి సమ న్లు జారీ చేయనుంది.