Mla Madan reddy | రైతులంతా ఏకమై కాంగ్రెస్, బీజేపీలను తరిమికొట్టాలి : ఎమ్మెల్యే మదన్‌రెడ్డి
Mla Madan reddy | రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలను రాబోయే ఎన్నికల్లో తరిమి కొట్టాలని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి(Mla Madan reddy ) పిలుపునిచ్చారు.
మెదక్ : రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలను రాబోయే ఎన్నికల్లో తరిమి కొట్టాలని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి(Mla Madan reddy ) పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి గ్రామ సమీపంలోని రైతు వేదికలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన కొత్తలో కాంగ్రెస్(Congress) నాయకులు విద్యుత్ పై హేళన చేశారని, మరోసారి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) ఉచిత విద్యుత్‌పై రైతులను మోసగిస్తున్నాడని ఆరోపించారు.
దేశం నివ్వెర పోయేలా 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సీఎం కేసీఆర్ ( CM KCR) అందిస్తున్నారు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి తానే సీఎం అయినట్లు పగటి కలలు కంటున్నాడు విమర్శించారు. గత ప్రభుత్వాల హయాంలో నాణ్యమైన విద్యుత్ లేక ట్రాన్స్ఫార్మర్లు (Transfarmers ) , మోటార్లు కాలిపోయేవి, కాని నేడు అలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు సుఖసంతోషాలతో వ్యవసాయం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
చంద్రబాబు వ్యవసాయం దండగ అంటే రేవంత్ 3 గంటల కరెంట్ అంటున్నాడని ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతాంగాన్ని అందిస్తున్న ఉచిత విద్యుత్‌ను చూసి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ పోకడల వల్ల తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

