బాలానగర్, మే 22 : మన ఊరు- మన బడి కార్యక్రమంలో ఎంపికైనా పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించాలని టీఎస్ఈడబ్ల్యూఐడీఎస్ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం చెన్నంగులగడ్డ తండాను సందర్శించారు.
‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా ఎంపికైనా ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించి పనులను పరిశీలించారు.అంతకుముందు గౌతాపూర్లో ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రవినాయక్,టీఆర్ఎస్ నాయకులు భూపాల్ రెడ్డి, యాదయ్య, తదితరులు ఉన్నారు.